వైసీపీ నాయకులు సీబీఐని బ్లాక్మెయిల్ … బొండా ఉమ
వైసీపీ నాయకులు సీబీఐని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ నేత బొండ ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేసిందేనని సీబీఐ స్పష్టంగా కోర్టుకు తెలిపిందన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని అన్నారు. దస్తగిరి అఫ్రూవర్ మారక తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించారన్నారు. హత్యను గుండెపోటు అని ఎలా అంటారని ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేశామని వైసీపీనే చెబుతోందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరారని, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీబీఐ విచారణ వద్దంటూ హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నారన్నారు.













