వాళ్ల ఓట్లన్నీ టీడీపీకే
ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడ్డాయని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు. చంద్రన్నకు అండగా మహిళా ఓటర్లు నిలిచారని టీడీపీ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేవారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న రుణం తీర్చుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు. ఈవీఎంలు మొరాయించినా గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి అయినా మహిళలు క్యూలైన్లలో ఉన్నారంటే తమకు మేలు చేసిన ప్రభుత్వాన్ని గెలుపించుకోడానికేనని అన్నారు.













