చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టం
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన వారందరూ మళ్లీ ఎన్నిక అవుతారన్నారు. చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని అన్నారు. తొలి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండడం తన అదృష్టమన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎందరో హామీలిచ్చారని, అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం టీడీపీ మాత్రమే అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత.. ఏపీలో తొలి టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజాతీర్పును ఉల్లంఘించడమే అని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎందుకు బయటకి వస్తున్నారో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉమా హితవు పలికారు.













