కొత్త జిల్లాలు చేసి ఏం సాధిస్తారు? : బొండా ఉమా
ఎవరి ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు పెంచుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమమహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విభజన వల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా? అని మండిపడ్డారు. జిల్లాల విభజన ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, ఇప్పుడు కొత్త జిల్లాలు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో సమతుల్యత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి పట్టుచీర కొంటానన్నాడన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు.













