అందుకే పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు : ఉమ
అమరావతి రాజధాని రైతులకు అడుగడుగునా నీరాజనాలు పట్టడం జగన్ తట్టుకోలేకపోతున్నాడని, అందుకే పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైఎస్ఆర్ పేరు మార్పు పై టీడీపీ ఎమ్మెల్యే ధర్నా చౌక్‌లో నిరసనకు దిగారు. ఈ సంరసద్భంగా ఉమ మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించాలన్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలంటే కొత్త హాస్పిటల్స్ కట్టి పేరు పెట్టుకోమని సూచించారు. 1986లో ప్రజలకి వైద్యం అందించే దిశగా స్వర్గీయ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు షర్మిల స్వయంగా పాదయాత్రలో పేరు మార్పుఫై ఖండిరచారు. తన చెల్లెలికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా సైకో జగన్‌కి లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పోరాడుతాం అన్నారు. దీనితోనే వైఎస్ జగన్ పతనం ప్రారంభమైంది అని పేర్కొన్నారు.













