కొడాలి నాని సవాల్ కు సై.. నిరూపిస్తే రాజకీయాల నుంచి
మంత్రి కొడాలి నానికి చెందిన కెే కన్వెన్షన్లో కేసీనో నిర్వహించారని, తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పు చేయకుంటే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గుడివాడ కేసినోపై అన్ని ఆధారాలున్నాయన్నారు. తామే పెట్రోల్ డబ్బా తెస్తామన్నారు. తాము చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే తామే తగులబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తాము నిరూపిస్తే మంత్రి కొడాలి నాని తగులబెట్టుకోవాలన్నారు. డేట్, టైమ్ కొడాలి ఫిక్స్ చేసినా సరే, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరేనంటూ సవాల్ విసిరారు. కే కన్వెన్షన్ తనిఖీకి వెళ్తే ప్రభుత్వం వణికిపోయిందన్నారు. దొరికిపోయిన దొంగ కొడాలి నాని అని ఎద్దేవా చేశారు. అర్ధనగ్న నృత్యాలు జరిగితే తానే ఆపించానని నాని ఒప్పుకొన్నారు అని అన్నారు.













