మీకు అంత నమ్మకం ఉంటే.. ఉగాది దాక ఎందుకు తక్షణమే
ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ కాళ్ల బేరానికి దిగాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ఉండవని అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో బొత్స తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బొత్స కుటుంబంతో సహా సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. మీకు అంత నమ్మకం ఉంటే ఉగాది దాకా ఎందుకు తక్షణమే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.













