ఇది నిజం కాదని వైసీపీ అంటే.. సీబీఐతో విచారణ
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ట్రైన్లో మట్టుబెట్టాలని చూశారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామను హత్య చేయటానికి ప్లాన్ చేశారన్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రఘురామ భీమవరం వచ్చుంటే అదే చివరి రోజు అయ్యేదన్నారు. బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే, రైలు దిగి పోయి ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. ఇది నిజం కాదని వైసీపీ అంటే సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సత్తనపల్లి రైల్వే స్టేషన్ పుటేజ్‌ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 100 మంది గుండాలతో రఘురామ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారన్నారు.













