గ్లోబల్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి
గ్లోబల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమలో లోకేష్ మాట్లాడుతూ టెక్నాలజీ వాడకంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. విద్యార్థులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా బ్లాక్ చైన్ హ్యాకథాన్ నిర్వహిస్తామన్నారు. ఈ టెక్నాలజీలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖకు వచ్చాయని, దీన్ని వివిధ రంగాల్లో ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. స్టార్టప్‌లకు బ్లాక్ చైన్ సరైన వేదిక అని అన్నారు. దేశంలోనే విశాఖ బ్లాక్ చైన్‌కు రాజధానిగా మారుతుందని తెలిపారు.













