ఎవరిని మభ్యపెట్టడానికి ఆ మాటలు ? : విష్ణుకుమార్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయం తనకు తెలియదని, తాను లండన్లో ఉండగా జరిగిందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం ఎవరిని మభ్యపెట్టడానికని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ను ప్రజలు మరికొద్ది రోజుల్లో ఓడిరచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచాలని కోరతాం. జగన్ పులివెందుల నుంచి కాకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. పొత్తులు లేకున్నా వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసి గెలుస్తా అని అన్నారు.













