వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించడమే లక్ష్యమని, మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలు ఇచ్చిందని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా పొత్తులపై సృష్టతిచ్చారని తెలిపారు. కేంద్రం సంకేతాలు లేకుంటే తానెందుకు ప్రస్తావిస్తానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్కు కేంద్రం నుంచి ఎలాంటి అండదండలేవని, సీబీఐ కేసుల్లో కేంద్రం అండగా ఉందనేది అపొమే మాత్రమే అని అన్నారు.













