PVN Madhav : కేరళ తరహాలో కోనసీమ అభివృద్ధి : పీవీఎన్ మాధవ్
పర్యాటకంగా కోనసీమ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. అమలాపురంలో చాయ్ పే చర్చ, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కేరళ (Kerala) తరహాలో కోనసీమ (Konaseema) ప్రాంతం లో అభివృద్ధి జరిగేలా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుంది. కోనసీమకు రైల్వే లైన్ (Railway Line) లేకపోవడం దురదృష్టకరం. లోక్సభ స్పీకర్గా బాలయోగి (Balayogi) ఉన్న సమయంలో రైల్వే లైన్ కు సర్వే జరిగింది. కొంకణ్ రైల్వే తరహాలో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే అంశంపై దేవాదాయశాఖ దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మనం ఆత్మనిర్బర్ భారత్ దిశగా అడుగులు వేయాలి. స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరగాలి. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుంది. సీఎం చంద్రబాబు (Chandrababu) ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు.













