బీజేపీకి వస్తున్న స్పందన చూసి.. వైకాపా నేతలకు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నింటిలోనూ అసమర్ధడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారన్నారు. బీజేపీకి వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదు అని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆరోపించారు.













