వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో
ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటల మాటున నిధుల తోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే జగన్ మాత్రం తన మాయమాటలతో ఏపీని నడుపుతున్నారు. ప్రజలను హింసిస్తున్న సీఎం జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు బోధనలతోనైనా జగన్‌లో మార్పు రావాలి. ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మట్టి కూడా వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. వాయిదాల సీఎం వాయిదాల మాటలు చెబుతున్నారు అని విమర్శించారు.













