అభివృద్ధే మా ధ్యేయం.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం
ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మాళ్లించారని తెలిపారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోంది. మోదీ ప్రధాని అయ్యేనాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవి. ఇవాళా దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో 50 కోట్ల మందికి కేంద్రం 5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసింది. ఉజ్వల పథకం కింద రూ.9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది అని తెలిపారు.













