వైసీపీకి అది తొలినుంచి అలవాటే
కాపుల రిజర్వేషన్ల విషయంలో పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ తన మంది మార్భలంతో మాటల దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ లోపాలను అవినీతిని ప్రశ్నించిన వారి క్రెడిబులిటీ, క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా నెపాన్ని అంటగట్టడం వైసీపీకి తొలి నుంచి అలవాటేన్నారు. గతం నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తూ బురదజలుతూ కొంత మేర అనుకున్నది సాధించారన్నారు. నేడు వైసీపీ అధికారంలో ఉన్న కూడా వారి లోపాలను ఎత్తిచూపిన వారికి కులం, మతం, ఆపాదిస్తూ, తోకపార్టీలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. అగ్రవర్ణాలతో ఉన్న పేదలకు, ఆర్థికంగా చేయూతనిచ్చేలా కేంద్రం పథకాలు ప్రవేశపెట్టినా ఏపీలో అమలు చేయడం లేదన్నారు.













