రాజధాని విషయంలో మూడు మక్కలాటొద్దు
రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడొద్దని ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన రాజధాని ఒక్కచోటే ఉండాలని సృష్టం చేశారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా అన్ని సంస్థల కార్యస్థానాలూ మూడు ప్రాంతాల్లోనూ ఉండాలన్నారు. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పారు. లేదంటే పూర్వపు రాజధాని అయిన కర్నూలులో ప్రధాన రాజధానిని ఏర్పాటు చేయండి. లేనిపక్షంలో మూడు ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోటే ప్రధాన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉండాలి. మిగతా రెండు చోట్లా మినీ సచివాలయాలు, హైకోర్టు బెంచ్‌లు పెట్టాలి. అసెంబ్లీ సమావేశాలూ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు మార్చడం అంత సులువేమీ కాదన్నారు. కర్నూలు, విశాఖల్లో బెంచ్‌లు పెట్టడం సులభమని, వీటితో పాటు ఇక్కడ మినీ సచివాలయాలు, శీతాకాల, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.













