జేపీ నడ్డాతో సుజనా చౌదరి భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత సుజనాచౌదరి ఢిల్లీలో భేటీ అయ్యారు. 30 నిమిషాలకు పైగా ఇద్దరు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగడం, ఎన్డీయే భేటీకి మిత్ర పక్ష జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చిన వెళ్లిన తర్వాత జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వీరు చర్చించినట్లు తెలిసింది.













