బీజేపీకి హరిబాబు రాజీనామా!
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో సృష్టంగా తెలియడం లేదు. రాష్ట్రలో బీజేపీ ఒకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తుతుండగా, హరిబాబు సంయమనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక దశలో గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడు, పార్టీ కోరినందునే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారా, లేక తనంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.













