డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. నవ్యాంధ్ర కల
2024లో బీజేపీ అద్భుత విజయం సొంతం చేసుకోనుందని, 400పైగా సీట్లు గెలుచుకోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నవాంధ్ర కల నెరవేరుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఎన్ని పాదయాత్రలు చేసినా కాంగ్రెస్కు ఉపయోగం లేదన్నారు. విశాఖ భూ కబ్జాలపై టీడీపీ వైసీపీ రెండు సిట్లు వేశాయని, కానీ ఆ రిపోర్టులను బయట పెట్టడం లేదని అన్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని ఆరోపించారు.













