ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? : సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు నిద్రపోతున్నారా? అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. ఆత్మకూరులో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. విజయవాడలో జరిగిన ఆందోళనలో సీఎం రమేష్ మాట్లాడుతూ అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే అదే గుడ్డిగా చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ బాగోలేదని మొదట్నుంచీ చెబుతున్నానని అన్నారు. పోలీస్ వ్యవస్థ బాగుంటే, శాంతి భద్రతలు బాగుంటాయన్నారు. రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నారని ఆరోపించారు.













