పవన్ చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు
ఇప్పటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది ఒకటి చెప్పేది మరొకటని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ చేస్తున్న పోరాటానికి బీజేపీ తరపున మద్దతు ఇస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళడం సహజమన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం అణచి వేయడం దుర్మార్గమన్నారు. పవన్ కల్యాణ్ కూల్చివేతలు పరిశీలించడానికి వెళితే అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహాల వద్ద ముళ్ల కంచెంల ద్వారా ఏమి చేప్పాలనుకున్నారని అన్నారు. బస్సు వెళ్లని మార్గాన్ని రహదారి విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. జగన్ అండ్ కో దాష్టికాలపై జనసేనతో కలిసి బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.













