బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. పవన్ మాతో
తమతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని బీజేపీ సీనియర్ నేత మాధవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై మాధవ్ స్పందించారు. జనసేనతో పొత్తు ఉన్నా, లేనట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి దూరం కావాలంటే జనసేన ఇష్టం. కలిసి సాగాలనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. తమ అభ్యర్థికి జనసేన మద్దతుందని పీడీఎఫ్ ప్రచారం చేసింది. పీడీఎఫ్ ప్రకటన ఖండిరచాలని కోరినా జనసేన స్పదించలేదన్నారు. మేం వైసీపీతో ఉన్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. బీజేపీ అధిష్ఠానానికి చెప్పే అన్నీ చేస్తున్నామని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రచారాన్ని పజలు నమ్మారని భావిస్తున్నాం. వైసీపీతో బీజేపీ కలిసిపోయిందనే ప్రచారం కూడా నష్టం చేసిందన్నారు.













