Adinarayana Reddy: అమరావతితో ఏపీకి స్వర్ణయుగం
ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) స్పష్టం చేశారు. విజయవాడలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju)తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి (Amaravati) పునప్రారంభ వేడక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ (Modi)కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూనే, అభివృద్దికి పెద్దపీట వేస్తోందన్నారు.













