జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన రోజు రోజుకూ బలపడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి సతీ సమేతంగా జనసేనలో చేరారు. ఆకుల దంపతులకు పవన్ పార్టీ కుండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ మాట్లాడుతూ ఆకుల దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క పిలుపుతో ప్రజల్ని రప్పించే నాయకుడు పవన్ మాత్రమేనని కొనియాడారు. పవన్ ఏ బాధ్యత అప్పగించినా త్రికరణ శుద్ధిగా చేస్తామన్నారు. లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ తాము ఏదో ఆశించి పార్టీలోకి రాలేదన్నారు.













