వైఎస్ కు ఆయనకి పోలిక ఏమిటి?.. నక్కకు నాగలోకానికి ఉన్నంత
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ కి పోలిక ఏమిటి? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు దిక్కుమాలిన సలహాలు ఎవరు ఇస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. జగన్న కాలనీలకు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇది పక్కా ప్రభుత్వ దోపిడీ అని ఆరోపించారు. ఈ పథకానికి జగన్న రౌడీ మామూళ్లు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని యెద్దేవా చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అన్న వాళ్ళు ఇప్పుడు, పోవాలి జగన్ అని అంటున్నారని తెలిపారు. గజం పది వేల రూపాయలు ఉన్న చోట ఎకరం స్థలానికి 24 లక్షల రూపాయల భారం ఉంటుందన్నారు. ప్రతి లే అవుట్లో ఓపెన్ బార్, వైన్ షాపులు పెట్టుకోడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని విమర్శించారు. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకునే దుస్థితి ఉందని విమర్శించారు.













