గతంలో బాదుడే బాదుడే.. ఇప్పుడు వాతలే వాతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలపై గతంలో బాదుడే బాదుడే అంటూ స్లోగన్స్ ఆయనకే వర్తిస్తాయని తెలిపారు. ఇప్పుడు ప్రజలకు వాతలే, వాతలు అంటూ వ్యాఖ్యానించారు. జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ఉగాది కానుక ఇచ్చారని మరో రెండేళ్లలో జగన్కు ఇంటికి పంపించి ప్రజలు గిఫ్ట్ ఇస్తారని యెద్దేవా చేశారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తే కనీసం 20 సీట్లు కూడా రావన్నారు. 8 మంది ఐఏఎస్లకు న్యాయమూర్తి కనికరించి వదిలేశారు లేదంటే వారు జైలుకు వెళ్లాల్సిందే అని తెలిపారు. అధికారులు అంత లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు.
దేశంలో ఇంత చెత్త ముఖ్యమంత్రి, నియంతృత్వ పాలన ఎక్కడ లేదన్నారు. సీఎం జగన్ ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంటారని, ఇల్లు, రేషన్ కార్డు, పథకాలు కట్ చేస్తారని ప్రజలు తమ అభిప్రాయాలు బయటకు చెప్పడం లేదని తెలిపారు. నేను కూడా మెడలో కండువా లేకపోతే జగన్ గెలుస్తాడని చెబుతాను కండువా మాకు శ్రీరామ రక్ష. లేదంటే నాకు కూడా పోలీసులతో కుమ్ముడే కుమ్ముడు అని అన్నారు.













