Vishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు

ప్రజావేదికను కూల్చిన వ్యక్తి ఇళ్లను కూడా కూల్చేస్తారని ఎవరూ ఊహించలేదని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) అన్నారు. శాసనసభ (Legislative Assembly) సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అందరికీ ఇళ్లు వంటి మంచి కార్యక్రమాన్ని వైసీపీ (YCP) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బలహీర వర్గాలంటే జగన్‌కు ఎందుకంత కక్షనో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇసుక పాలసీని తీసుకొచ్చి నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. కాంట్రాక్టర్ల(Contractors) ను కూడా వేధించి ఇబ్బందికి గురి చేసిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. విధ్వంసానికి మరోపేరు ఆయనే అని మండిపడ్డారు.