ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు : సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడంతో ప్రభుత్వం అనాలోచిత ధోరణి బయటపడిరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించేది ఉద్యోగులేనని అన్నారు. ఉద్యోగులేమీ రాజకీయ నాయకులు కాదు, వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులకు కూడా పీఆర్సీ వస్తుంది. ఎన్జీవోలను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలన్నారు. ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతిస్తోందన్నారు. ఉద్యమాలు చేయాల్సి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు రాకూడదు. ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు సవ్వంగా చెల్లించలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం దగ్గర డబ్బులేదు. ఉద్యోగులవి న్యాయపరమైన కోర్కెలు. ఆదాయ మార్గాలు అన్వేషించి ఉద్యోగుల కోర్కెలను ముఖ్యమంత్రి తీర్చాలని డిమాండ్ చేశారు.













