ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. నందిగామాలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ అమరావతికి బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. అవినీతి, కులం ప్రాతిపదికన వచ్చిన వైసీపీకి సహకారం ఉండదన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య ఎక్కడా పొంతన లేదు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు దృష్టికి తీసుకెళ్లడంలో తాము వైఫల్యం చెందుతున్నామన్నారు. స్మృతి వనం నిర్మిస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారన్నారు. దళిత సమాజం పట్ల ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో వయసులో పెద్దవాడైన నారాయణస్వామి కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చారని అన్నారు.













