సీఎం భయపడే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భయపడే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీకి ఓటేస్తే ఉపయోగం లేదని జనాలు భావిస్తున్నారని తెలిపారు. తిరుపతిలో బీజేపీ, జనసేనల ప్రచారం ఉత్సాహంగా సాగుతోందన్నారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శలు గుప్పించారు.













