ఏపీకి రావాలంటే భయపడే పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి దుగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో పురందరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి భూకబ్జాలు ధౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అరాచక పాలనకు చెక్ పెడదామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.













