బీజేపీకి ఎమ్మెల్యే ఆకుల గుడ్ బై
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజమని ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని ముహూర్తం పెట్టుకున్నట్టు చెప్పారు. భారతీయ జనత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి తన రాజీనామా లేఖలను అందిస్తానని ఆకుల సృష్టం చేశారు. దేశంలో బీజేపీ ఒక క్రమశిక్షణ కలిగిన పటిష్టవంతమైన నాయకత్వం కలిగిన పార్టీ అని, అయితే ఏపీలో మాత్రం అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు.













