పాపం ఏపీ బీజేపి… ఇంకెప్పుడు…?
భారతీయపార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లోకి వెళ్లే విషయం ముందు నుంచి కూడా విఫలమవుతూనే ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు ముందు నుంచి కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కాస్త అధికార పార్టీ బలంగా ఉండడం అలాగే ప్రతిపక్షం కూడా సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగి ఉండటంతో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లి కార్యకర్తల బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ప్రయత్నం పెద్దగా చేయడం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ కోసం పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎవరు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి లేదు అనే మాట వాస్తవం.
హిందూ సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బలంగా లేవు. దీంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. అయినా సరే ప్రజల్లోకి వెళ్లే విషయంలో చాలా మంది నేతలు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే ప్రజల్లోకి వెళ్లి చాలా రోజులు అయిపోయింది. ఆయన అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడటం మినహా పెద్దగా అధికార వైసిపిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు అని చెప్పాలి.
దీంతో ప్రతిపక్షం అనే మాట కూడా వచ్చే ఎన్నికల్లో దక్కే అవకాశం లేదు అని చెప్పాలి. కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా చాలా నియోజకవర్గాల్లో లేరు. అయినా సరే దీనిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇక బీజేపీ లో ఉన్న కొంతమంది నేతలు అధికార వైసీపీ కోసం పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కనీసం వీటిని కూడా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇక బీజేపీ నుంచి రాష్ట్రంలో నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్న సరే వాళ్ళు కూడా పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీనివలన పార్టీ సంస్థాగతంగా ఇబ్బంది పడుతుంది అనే ఆవేదన కొంతమందిలో వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పరిస్థితి కి సంబంధించిన నివేదికలు కూడా బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు ఇవ్వలేకపోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. మరి ఇప్పటికైనా సరే బిజెపి రాష్ట్ర స్థాయి నేతల వైఖరి మారుతుందా ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. అయితే సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీలో వేగం తగ్గింది అనే ఆవేదన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.













