బీజేపీ ఎంట్రీ టీడీపీ కి ప్లస్సా లేక మైనస్సా..
రాజకీయాలలో లెక్కలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇదే కన్ఫ్యూజన్ తలెత్తుతోంది. ఎన్నికలకు పెద్ద సమయం లేదు.. ఎక్కడ ప్రజలలో ఎవరికి ఓటేస్తారు అన్న విషయంపై స్పష్టత లేదు. అసలు ఇంత కన్ఫ్యూషన్ కి ముఖ్య కారణం మన నేతలే అనడం ఎంతో కరెక్టుగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ ,జనసేన ఒక కూటమిగా ముందుకు కదిలారు.. బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా అన్న కన్ఫ్యూషన్ నెలకొంది. అయితే ఇప్పుడు తీరా బీజేపీ ఎంట్రీ ఇచ్చాక మరొక కన్ఫ్యూషన్ తలెత్తుతుంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ హవా నడుస్తుంది అన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు .కానీ మనలో కొన్ని వర్గాలు బీజేపీ ని వీలైనంత దూరంగా పెడతాయి. మరి ముఖ్యంగా ఆంధ్రాలో మైనారిటీ వర్గాలకు బీజేపీ అంటే కాస్త పడదు. మోడీకి ఉన్న ఇమేజ్.. రామాలయం నిర్మించడం.. ఇవన్నీ ఒక వర్గానికి నచ్చుతాయి, కానీ మరొక వర్గానికి నచ్చవు. ఇక ఏపీలో బీజేపీ అంతంత మాత్రంగా ఉన్న పార్టీ.. పైగా మోడీ ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని మన నాయకులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకేమీ చేయని పార్టీ కి సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి అని జనాలు అనుకుంటారు కదా. కొంతమంది బీజేపీ కూటమిలో కలవడం వల్ల చంద్రబాబుకు బలం ఏర్పడింది అని వాదిస్తుంటే. మరికొంతమంది ఈ కూటమి బలం సున్నా అని తేల్చేస్తున్నారు. మరి అసలు ఫలితం ఏమిటి అని చెప్పాల్సిన ఓటర్లు మాత్రం చాలా కామ్ గా ఉన్నారు. విషయం తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే..













