బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్యాలరావు?
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పైడికొండల మాణిక్యాలరావును ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది. గత నాలుగు రోజులుగా మాణిక్యాలరావు ఢిల్లీలోనే మకాంవేసియున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మాణిక్యాలరావు బీజేపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ సాధారణ కార్యకర్తగా వున్నారు. ఆ పార్టీలో సాధారణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పదవులను ఇంతవరకు పోషించారు. తెలుగుదేశం పార్టీ మద్దతులో 2014 ఎన్నికల్లో ఆయన తాడేపల్లి శాసన సభ్యులుగా నిలిచారు. టీడీపీ బీజేపీతో మిత్రత్వం ఉండడంతో రాష్ట్ర కాబినెట్లో దేవాదాయశాఖా మంత్రిగా పనిచేసారు. 2014 నుండి హోదా గొడవల వరకు మాణిక్యాలరావు దేవాదాయ శాఖమంత్రిగా సమర్థవంమతైన సేవలందించారు. పదవులు రాజీనామా సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి కూడా సమర్థడైన నాయకుడిగా ప్రశంసలు పొందారు. అయితే తరువాత పరిణామలు టీడీపీ బీజేపీల మధ్య తీవ్ర శత్రుత్వాన్ని పెంచాయి. ఈ దశలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నూతన వ్యక్తిని ఎంపికచేసే దిశలో మాణిక్యాల రావు పేరు తెరపైకొచ్చింది.













