ఆత్మకూరు ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఖరారు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీకి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాని సవాల్ విసిరారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారం పాల్గొని లక్ష మెజారీటీతో గెలుపొందాలన్నారు. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. టీడీపీకి స్థిరమైన సిద్ధాంతం లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.













