Rajya Sabha: రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ
వైసీపీతో పాటు రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వానికి విజసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామాతో ఖాళీ అయిన సీటు బీజేపీ ఖాతాలో చేరనుంది. ఎన్డీయే (NDA) కూటమి తరపున బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) ను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్చార్జి అరుణ్ సింగ్ (Arun Singh) ఈ మేరకు ప్రకటనలో వెల్లడిరచారు. ఈ సీటుకు పలువురు పోటీ పడగా బీజేపీ అధిష్ఠానం మాత్రం పార్టీలో నమ్మకస్తుడిగా పేరున్న పాకా సత్యనాయణకు పట్టం కట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నారు. బీసీ (గౌడ్) వర్గానికి చెందిన ఆయన దాదాపు 45 ఏళ్లుగా బీజేపీ జెండా మోస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలు పలువురు అభినందనలు తెలిపారు.













