Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్!
ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్ (Bits) విశ్వవిద్యాలయానికి గోవా, హైదరాబాద్, దుబాయిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. తాజాగా అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. సీఆర్డీఏ(CRDA) అధికారులతో కలసి బిట్స్ ప్రతినిధులు కురగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో, వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను చూశారు.













