శ్రీవారి సేవలో ఏపీ నూతన గవర్నర్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వయోవృద్ధుల క్యూలైనులో ఆలయంలోకి సతీ సమేతంగా ప్రవేశించారు. ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి గవర్నర్ దంపతులను శ్రీవారి సన్నిధికి ఆహ్వానించారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామి వారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట చేరుకుని విజయవాడకు విమానంలో ప్రయాణమయ్యారు.













