ఆంధ్రప్రదేశ్ మత్స్య దిగుమతులపై నిషేధం ఎత్తివేసిన బీహార్ ప్రభుత్వం
ఏటా పెద్దఎత్తున ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న బీహార్. ఏపీ నుంచి వెళ్తున్న మత్స్య ఉత్పత్తులలో పార్మాలిన్ అనే ప్రిజర్వేటీవ్ను వాడుతున్నారనే ఆరోపణతో ఇటీవల దిగుమతుల్ని నిషేధించిన బీహార్ ప్రభుత్వం. దీనిపై జోక్యం చేసుకుని బీహార్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన బీహార్ ప్రభుత్వం.
బీహార్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎహెచ్, డీఎఫ్) ఎన్. విజయలక్ష్మి, మత్స్య శాఖ డైరెక్టర్ ఎం. అహ్మద్‌లతో ప్రత్యేక కమిటీని నియమించిన బీహార్ ప్రభుత్వం. బీహార్ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏపీలో వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన. తమ పరిశీలనలో ఏపీలో మత్స్య ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లో ఎటువంటి ప్రిజర్వేటీవ్స్ వినియోగించడం లేదని నిర్ధారించిన బీహార్ అధికారుల బృందం.
ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ పర్యటన వివరాలు, క్షేత్రస్థాయిలో తెలుసుకున్న వాస్తవాలను వివరించిన బృందం. తక్షణం నిషేధం ఎత్తివేస్తున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపిన బీహార్ అధికారుల బృందం. ఎటువంటి కల్తీ జరగకుండా, ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని బీహార్ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిపై ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నాయని తెలిపిన సీయం.
మత్స్య ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి ఎగుమతులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందిస్తున్నామని, అధీకృత స్టిక్కర్లను వేయిస్తున్నామని చెప్పిన సీయం. డిపార్టుమెంట్ ఆఫ్ ఫిషరీస్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసన్, పబ్లిక్ హెల్త్, ల్యాబ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఫిష్ ప్యాకేజింగ్ షెడ్లు, హోల్ సేల్ ఫిష్ అవుట్ లెట్స్ ను పరిశీలించి వీటిలో ఎక్కడా అమోనియా, ఫార్మలిన్ వాడటం లేదని నివేదిక ఇచ్చారన్న సీయం.
ముఖ్యమంత్రిని కలిసిన అధికారులలో ప్రిన్పిపల్ సెక్రటరీ (పశు సంవర్ధక శాఖ) దమయంతి, ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఉన్నారు.













