వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. తాను ఎలాంటి పదవులూ ఆశించడం లేదని సృష్టం చేశారు. తిరుపతిలో జరిగిన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, జైలు జీవితం కూడా గడిపానని గుర్తు చేసుకున్నారు. అయినా, ఎవరికీ తలవంచనని తెలిపారు. తనకు మంత్రి పదవిపై ఆశలేదని.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుంటే తన కుమారుడు రాజకీయ వారసుడిగా వస్తాడని అనుకుంటే పొరపాటేనని వెల్లడించారు. కాగా మంత్రివర్గ ఏర్పాటుపై కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న తరుణంలో కరుణాకర్‌రెడ్డి నోటి వెంట ఇలాంటి మాటలు రావడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది.













