నంద్యాల సీటు బ్రహ్మానందరెడ్డికే!
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు దాదాపు ఖారారయింది. ఇప్పటివరకూ ఆయనకు పోటీగా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లడం, మాజీ మంత్రి ఫరూఖ్, ఎంపి వైస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు సహా అందరూ బ్రహ్మానందరెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖారారయింది. ఆ మేరకు నేడో, రేపో ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేత కాటసాని రామిరెడ్డికి అల్లుడు కూడా అయిన బ్రహ్మానందరెడ్డి బరిలో ఉంటే, బలమైన కాటసాని వర్గం కూడా పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న అంచనా పార్టీ నాయకత్వంలో ఉంది.













