ఘనంగా మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం
దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కూతురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ వేడుకను నిర్వహించారు. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, పారిశ్రామిక వేత్త భార్గవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుంది. గత కొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థ వేడుక గురించి మంత్రి అఖిలప్రియ కుటుంబం కానీ, భార్గవ్ కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.













