Bhogapuram Airport: ఒక నెల ముందుగానే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం : రామ్మోహన్ నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్టులో రాష్ట్ర మంత్రి లోకేశ్ (Minister Lokesh) సమక్షంలో జీఎంఆర్ – మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ (Trial run) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్టును ప్రారంభించాలనుకున్నామని, కానీ ఒక నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎడ్యుసిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు.






