ఏపీలో స్తంభించిన రవాణా
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలిచ్చిన బంద్ ఏపీలో కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ బంద్కు మద్దతిచ్చాయి. బీజేపీ మినహా రాజకీయ పక్షాలన్నీ ఈ బంద్కు మద్దతివ్వడంతో ఆంధ్రప్రదేశ్లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా ఈ బంద్కు మద్దతిస్తూ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మద్దిలపాలెం, గాజువాక జంక్షన్లలో వామపక్షాలు నిరసన చేపట్టాయి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.













