ఈ యాక్టును ఇప్పుడే అమలు చేయం : మంత్రి ధర్మాన
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అభ్యంతరాలు తెలియజేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఈ యాక్టును ఇప్పుడే అమల్లోకి తేవడం లేదని తెలిపారు. భూముల రీసర్వే పూర్తయితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని వివరించారు. న్యాయనిపుణులు, ప్రజాసంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అమలు చేస్తామన్నారు. ఇందుకోసం విధివిధానాలు ఇంకా రూపొందించలేదని అన్నారు. ప్రభుత్వ వైబ్సైట్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని వెల్లడించారు.













