MLC Ravichandra:మంత్రి లోకేష్ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలి

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి తల్లిదండ్రుల్లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నమ్మకం కలిగించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ (Beda Ravichandra Yadav) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేద్దామని నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు ఉండవల్లి నివాసంలో లోకేష్‌ని కలిసి పేద విద్యార్థుల కోసం పుస్తకాలు (Books) , పెన్నుల (pens) ను కేఎల్ఎస్ ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ అధినేత శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) తో కలిసి అందజేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను లోకేష్‌కు అందజేశారు. పూలబొకేల బదులు విద్యార్థుల సహాయార్ధం పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని లోకేష్ చెప్పారని, ఈ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 15నెలల్లోనే విద్యుత్ చార్జీలు తగ్గించి సీఎం చంద్రబాబు చూపించారని పేర్కొన్నారు. మెరుగైన విద్యుత్ సంస్కరణల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు. అవాస్తవ ప్రచారాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.