మస్తాన్‌రావుకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి?
నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. యాదవ సామాజికవర్గానికి చెందిన మస్తాన్ రావు పార్టీ అధినేతకు విధేయుడు. యాదవ వర్గానికి ఈ పదవి ఇవ్వడం వల్ల చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న యాదవులను ఆకర్షించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను ఆకర్షించేందుకు ఈ వర్గానికే చెందిన మస్తాన్‌రావుకు కీలకమైన టిటిడి చైర్మన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.













