నాడు-నేడు కార్యక్రమానికి రూ.కోటి విరాళం
పాఠశాలలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల కోసం ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి బీఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు రూ.కోటి విరాళం అందించారు. కావలి నియోజకవర్గం ఇస్కపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆట స్థలానికి 3.10 ఎకరాల స్థలం ఇచ్చారు. విరాళానికి సంబంధించిన చెక్కు, స్థలం దస్తావేజులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్కు బీద మస్తాన్రావు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.













